Hyderabad, అక్టోబర్ 4 -- కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ కలెక్షన్ డే 2: 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కంతారా సినిమా ప్రీక్వెల్ అయిన కాంతార 2 అక్టోబర్ 2న రిలీజ్ అయింది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 అదిరిపోయే టాక్‌తో దూసుకుపోతోంది.

రూ. 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 సినిమా ఓపెనింగ్ రోజున ఇండియాలో రూ. 61.85 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అందులో సొంత సినీ ఇండస్ట్రీ అయిన కన్నడ నుంచి ఎక్కువగా రూ. 19.6 కోట్లు, హిందీ బెల్ట్ ద్వారా రూ. 18.5 కోట్లు, తెలుగులో రూ. 13 కోట్లు, తమిళంలో 5.5 కోట్లు, మలయాళంలో రూ. 5.25 కోట్ల కలెక్షన్స్ ఉన్నాయి.

అయితే, రెండో రోజు అయిన శుక్రవారం (అక్టోబర్ 3) నాడు కాంతార 2 నెట్ ఇండియా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. దాదాపుగా 25.63 శాతం వరకు రెండో రోజు కాంతార చాప్టర్ 1 కలె...