భారతదేశం, మార్చి 27 -- అమెరికాకు మరిన్ని ఉత్పాదక ఉద్యోగాలను తీసుకురావడమే లక్ష్యంగా వాణిజ్య యుద్ధాన్ని విస్తరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చెప్పారు. ఆటోమొబైల్ దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించారు.

అమెరికా వెలుపల తయారయ్యే వాహనాలపై 25 టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంతకం చేశారు. ఆటో టారిఫ్ ల వల్ల 100 బిలియన్ డాలర్ల కొత్త ఆదాయం వస్తుందని వైట్ హౌస్ తెలిపింది. ఇది అమెరికా తయారీ పరిశ్రమను బలోపేతం చేస్తుందని వైట్ హౌస్ తెలిపింది.

అమెరికాలోకి ప్రవేశించే ప్యాసింజర్ కార్లు, ట్రక్కులు, కొన్ని ఆటో విడిభాగాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ సుంకాలను ప్రకటించింది. ఈ క్రింది దిగుమతులపై 25% సుంకం విధిస్తారు.

విడిభాగాలు అమెరికాలో తయారైతే, వాటిపై పన్ను లేదా సుంకం ఉండదని, మన దగ్గర చాలా పటిష్టమైన పోలీసింగ్ ఉంటుంద...