భారతదేశం, జనవరి 14 -- డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ అందించాడు. ఈ సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో ఈ డైరెక్టర్ రేంజ్ మరో లెవెల్ కు వెళ్లింది. తాజాగా మూవీ సక్సెస్ మీట్ లో అతడు మీడియాతో మాట్లాడాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలు ఇస్తూ అనిల్ నవ్వించాడు.

మన శంకరవరప్రసాద్ గారు మూవీ స్క్రిప్ట్ ను తాను కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేసినట్లు అనిల్ రావిపూడి చెప్పాడు. తన కెరీర్లో అత్యంత వేగంగా పూర్తి చేసిన స్క్రిప్ట్ ఇదేనని తెలిపాడు. చిరులో ఉన్న లక్షణాలనే ఊహించుకుంటూ తాను కథ సిద్ధం చేశానని, దీంతో స్క్రిప్ట్ పూర్తి చేయడానికి పెద్దగా టైమ్ పట్టలేదని చెప్పాడు. ఈ సినిమా కోసం చిరంజీవి 85 రోజుల పాటు షూట్ చేశాడని వెల్లడించాడు.

ఈ సినిమాలో దళపతి మూవీలో సుందరి పాటను వాడటంపైనా అనిల్ స్పందించాడు. తన పాటలను సినిమాల్లో వాడుకో...