భారతదేశం, డిసెంబర్ 25 -- హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. లయన్ కింగ్ లో బాల నటిగా గుర్తింపు తెచుకున్న 25 ఏళ్ల ఇమాని స్మిత్ హత్యకు గురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిడిల్‌సెక్స్ కౌంటీ, న్యూజెర్సీ ప్రాసిక్యూటర్ యోలాండా సిక్కోన్, ఎడిసన్ పోలీస్ చీఫ్ థామస్ బ్రయాన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారంజజ 'లయన్ కింగ్'లో నటించిన మాజీ బాలనటి ఇమాని స్మిత్ డిసెంబర్ 21న మృతి చెందినట్లు వెల్లడైంది.

ఇమాని స్మిత్ వయసు 25 సంవత్సరాలు. ఆమెను ఆమె ప్రియుడు జోర్డాన్ డి. జాక్సన్-స్మాల్ హత్య చేశాడని ఆరోపణలున్నాయి. పలు నివేదికల ప్రకారం, డిసెంబర్ 21 ఉదయం 9:18 గంటలకు కత్తిపోటు గురించి 911 కు కాల్‌కు పోలీసులు స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇమాని స్మిత్‌ను కత్తిపోట్లతో గాయపడి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆమెను రాబర్ట్ వుడ్ జా...