భారతదేశం, జూలై 19 -- మనలో చాలామంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పెద్దగా పట్టించుకోరు. రాత్రిపూట చెమటలు పట్టడం, అలసట, అప్పుడప్పుడు వచ్చే నొప్పులు వంటి వాటిని పెద్ద సీరియస్ సమస్యలు కావనుకుంటారు. కానీ, కొన్నిసార్లు ఈ చిన్న లక్షణాలే ఏదో పెద్ద ప్రమాదానికి సంకేతాలు కావచ్చు. ప్రముఖ హెల్త్ కోచ్ దిలన్, ఏప్రిల్ 8న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, తాను విస్మరించిన క్యాన్సర్ తొలి లక్షణాలను, అందరూ తప్పకుండా గమనించాల్సిన సంకేతాలను పంచుకున్నారు. అవేంటి?

"మొదట రాత్రిపూట చెమటలు పట్టడం మొదలైంది. కేవలం వేడిగా అనిపించడం కాదు.. నా దుప్పట్లు పూర్తిగా తడిసిపోయేలా చెమట పట్టేది" అని దిలన్ గుర్తు చేసుకున్నారు. "అర్థరాత్రి బట్టలు మార్చుకునేవాడిని, మళ్ళీ నిద్ర లేచేసరికి పూర్తిగా చెమటతో తడిసిపోయేవాడిని" అని వివరించారు.

''ఆ తర్వాత దురద మొదలైంది. ఎంత గోకినా తీరని విపరీతమై...