భారతదేశం, ఫిబ్రవరి 11 -- 2001లో తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీ మనసంతా నువ్వే. అప్పటికే చిత్రం, నువ్వు నేను సినిమాలతో సక్సెస్ అందుకున్న ఉదయ్ కిరణ్ కు మనసంతా నువ్వే మూవీ హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ కానుంది. 25 ఏళ్లకు మళ్లీ థియేటర్లకు రాబోతుంది.

కల్ట్ లవ్ స్టోరీగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన సినిమాల్లో మనసంతా నువ్వే. ఇందులో ఉదయ్ కిరణ్ హీరో కాగా.. రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. 2001, అక్టోబర్ 19న థియేటర్లలోకి వచ్చి సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లకు ఈ లవ్ స్టోరీ మళ్లీ రాబోతుంది.

మనసంతా నువ్వు రీ రిలీజ్ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఈ మూవీ గురించి మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.

''నేను ఉదయ్ కిరణ్ మేనకోడలు...