Hyderabad, సెప్టెంబర్ 23 -- కాంతార ఛాప్టర్ 1న మూవీ మరో పది రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై ఎన్ని భారీ అంచనాలు ఉన్నాయో తాజాగా రిలీజైన ట్రైలర్ కు వచ్చిన వ్యూస్ చూస్తే స్పష్టమవుతోంది. కేవలం తొలి 24 గంటల్లోనే మూవీకి పది కోట్లకుపైగా వ్యూస్ రావడం విశేషం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ హోంబలే ఫిల్మ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్లో నటించిన మూవీ కాంతార ఛాప్టర్ 1. ఈ సినిమా అక్టోబర్ 2న దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. సోమవారం (సెప్టెంబర్ 22) ట్రైలర్ రిలీజ్ కాగా.. 24 గంటల్లో ఏకంగా 107 మిలియన్లు అంటే 10.7 కోట్ల వ్యూస్ వచ్చినట్లు హోంబలే ఫిల్మ్స్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

అన్ని భాషల్లో కలిపి ఈ వ్యూస్ రాగా.. మొత్తంగా 3.4 మిలియన్ లైక్స్ రావడం విశేషం. అయితే ఈ ట్రైలర్ క...