భారతదేశం, ఆగస్టు 27 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లొ ఎక్కువ మంది చూసిన మూవీగా యానిమేటెడ్ సినిమా కేపాప్ డెమోన్ హంటర్స్ రికార్డు అందుకుంది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కంపానియన్ వెబ్ సైట్ టుడుమ్ ప్రకారం.. అధికారికంగా డ్వేన్ జాన్సన్, ర్యాన్ రేనాల్డ్స్, గాల్ గాడోట్ నటించిన రెడ్ నోటీస్ మూవీని దాటేసింది. నెట్‌ఫ్లిక్స్ లో అత్యధికంగా స్ట్రీమింగ్ అయిన సినిమాగా కేపాప్ డెమోన్ హంటర్స్ నిలిచింది.

సోనీ పిక్చర్స్ యానిమేషన్ రూపొందించిన ఈ యానిమేటెడ్ మ్యూజిక్ ఓటీటీలో 236 మిలియన్ వ్యూస్ సాధించింది. నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసిన డేటా ప్రకారం గత వారం అదనంగా 25.4 మిలియన్ వ్యూస్ తో కేపాప్ డెమన్ హంటర్స్ ఇంగ్లీష్ ఫిల్మ్ లిస్ట్ లో నెం.1 మూవీగా నిలిచింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ అత్యధికంగా స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 5 సినిమాలు వరుసగా కేపాప్ డెమోన్ హంటర్స్, రెడ్ ...