భారతదేశం, అక్టోబర్ 28 -- ఏపీలో మెుంథా తుపాను ప్రభావం గట్టిగా ఉంది. కోస్తా జిల్లాలోపాటుగా ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలోనూ వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 233 మండలాలు, 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుపాను ప్రభావం చూపిస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.

ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మెుంథా తుపాను ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. చెట్లు విరిగిపడుతున్నాయి. సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. విజయవాడలో ఐఎండీ హెచ్చరించినట్టుగా కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. నగరంలో 16.2 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇళ్ల నుంచి ప్రజలకు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. విజయవాడ నగరపాల సంస్థ పరిధిలో 41 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

విశాఖ, అనకాపల్లిలోనూ వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి ...