భారతదేశం, అక్టోబర్ 26 -- ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​లోని మొదటి రెండు మ్యాచుల్లో విరాట్​ కోహ్లీ వరుసగా రెండుసార్లు డకౌట్​ అయ్యాడు. ఇక అతని పనైపోయిందని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ మూడో వన్డేలో అతని అద్భుత ప్రదర్శన చూసి, కొన్ని రోజుల క్రితం విమర్శించిన వారే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కోహ్లీ ఇంకా ఆడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. "వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్"​గా సచిన్​ టెండుల్కర్​ పేరిట ఉన్న రికార్డును రన్​ మెషిన్​ కోహ్లీ బ్రేక్​ చేయగలడా? అన్న టాపిక్​పై ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. మరి ఆ ఫీట్​ సాధ్యమేనా? కోహ్లీకి ఛాన్స్​ ఉందా? ప్రాబబిలిటీలను ఇక్కడ పరిశీలిద్దాము..

ఇప్పటికే టీ20, టెస్టుల నుంచి తప్పుకున్న విరాట్​ కోహ్లీ .. 2027 వరల్డ్​ కప్​ తర్వాత వన్డేల నుంచి కూడా రిటైర్​ అవ్వొచ్చు అని ఊహ...