భారతదేశం, డిసెంబర్ 12 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'ధురందర్' ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలలో ఒకటి. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అంచనాలకు మించి దుమ్ము రేపుతోంది. ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన రావడంతో ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురందర్ సినిమా విడుదలైన మొదటి వారం రోజుల్లోనే భారత్‌లో ఏకంగా రూ. 200 కోట్ల మార్క్‌ను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సినిమా నిర్మాతలు తమ అధికారిక ఎక్స్ ఖాతా (గతంలో ట్విట్టర్) ద్వారా కలెక్షన్ల వివరాలను పంచుకున్నారు.

ధురందర్ సినిమా గురువారం (డిసెంబర్ 11) ఒక్కరోజే రూ. 29.20 కోట్లు వసూలు చేసినట్లు వారు ప్రకటించారు. ప్రముఖ సినీ లెక్కల వెబ్‌సైట్ సక్నిల్క్ (Sacnilk) తాజా అప్‌డేట్ ప్రక...