భారతదేశం, జనవరి 29 -- న్యూ ఢిల్లీ: భారతదేశ ఇంధన పరివర్తనలో (Energy Transition) భాగంగా కేంద్ర ప్రభుత్వ మేధోమథన సంస్థ 'నీతి ఆయోగ్' ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. 2047 నాటికి దేశంలోని ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటాను ప్రస్తుతం ఉన్న 6 శాతం నుండి ఏకంగా 90 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తోంది. నెట్-జీరో ఉద్గారాల లక్ష్యంతో రానున్న ఈ రోడ్‌మ్యాప్, భారత రవాణా రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టనుంది.

రవాణా, పరిశ్రమలు, భవన నిర్మాణం, వ్యవసాయం, విద్యుత్ రంగాలలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు (Decarbonization) నీతి ఆయోగ్ త్వరలోనే ఒక సమగ్ర నివేదికను విడుదల చేయనుంది. 2070 నాటికి భారత్‌ను పూర్తిగా ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగానే రైలు, విమాన ప్రయాణాల్లో కూడా కీలక మార్పులను ఈ ప్లాన్ సూచించనుంది.

ప్రభుత్వ 'వాహ...