భారతదేశం, నవంబర్ 9 -- హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ను విమర్శించారు. పదేళ్ల పాలనలో సగటున రూ. 2 లక్షల కోట్ల వార్షిక ఆదాయం ఆర్జించినప్పటికీ, హైదరాబాద్‌లోని కొన్ని ఫ్లైఓవర్‌లతో సహా అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైనా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న పరిశ్రమలను గుజరాత్‌కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సెమీ కండక్టర్ల కంపెనీని ఆ రాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

'1994 నుండి 2004 వరకు టీడీపీ 10 సంవత్సరాలు పాలించింది, 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ (అప్పటి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. 2014 నుండి బీఆర్...