భారతదేశం, సెప్టెంబర్ 8 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2027-28 విద్యా సంవత్సరం నుండి 10 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించనుంది. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం, వీటిని పబ్లిక్ ప్రైవేట్ పార్టర్నర్‌షిప్ పద్ధతిలో అభివృద్ధి చేస్తారు. ఈ వైద్య కళాశాలల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యకు పెద్ద ఊతం ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో కొత్త విద్యాసంస్థలు రానున్నాయి. మొదటి దశలో భాగంగా, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో వైద్య కళాశాలల ప్రారంభించడానికి ప్రతిపాదనల కోసం ముసాయిదా అభ్యర్థన, రాయితీ ఒప్పందాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ...