భారతదేశం, డిసెంబర్ 1 -- ఏలూరు జిల్లాలోని గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పింఛన్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని చంద్రబాబు అన్నారు. తాను, పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఒకే రకంగా ఆలోచిస్తామన్నారు.

'మా ప్రభుత్వంలో పింఛన్లకు ఏడాదికి రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏపీలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అందులో 95 శాతం మంది మహిళలే. మా ప్రభుత్వానికి కష్టాలు, అప్పులు ఉన్నాయి. అయినా ఒకేసారి 4 వేలకు పింఛన్లు పెంచాం. జనాభాను పెంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే మిషన్లతో పని చేయించాల్సి ఉంటుంది.' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పున:నిర్మ...