భారతదేశం, డిసెంబర్ 23 -- మరికొద్ది రోజుల్లో 2026 కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో పండుగల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా దీపావళి, నవరాత్రులను చాలా మంది ఘనంగా జరుపుకుంటారు. సంక్రాతి తరవాత వచ్చే పెద్ద పండుగలు ఇవి. ఈ పండుగలు హిందూ యొక్క ప్రధాన పండుగలు. ఈ పండుగలను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు. హోలీ రంగుల పండుగ, దీపావళి దీపాల పండుగ. అలాగే నవరాత్రి సమయంలో భక్తులు అమ్మవారి భక్తిలో మునిగిపోతారు. 2026 లో హోలీ, దీపావళి, నవరాత్రులు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం, 2026లో హోలీ పండుగ 4 మార్చి 2026న వచ్చింది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి మరుసటి రోజున చైత్ర మాసంలోని కృష్ణ పక్షం మొదటి రోజున హోలీ జరుపుకుంటారు. ఈ పండుగ చెడుపై మంచి విజయానికి ప్రతీక, ప్రజలు ఈ పండుగను రంగులు, ఆనందంతో జరుపుక...