భారతదేశం, జనవరి 7 -- 18 సంవత్సరాల తర్వాత మకర రాశిలోకి రాహువు: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాహువు, కేతువులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. రాహువు స్థానం జాతకంలో శుభప్రదంగా ఉంటే, వ్యక్తి జీవితంలో సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, ఆనందంగా ఉంటారు. అలాగే ఒకవేళ రాహువు చెడు స్థానంలో ఉంటే, సమస్యలు వస్తాయి.

రాహువు సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే, నీడ గ్రహమైన రాహువు కుంభ రాశిలో ఉన్నాడు. 2026 చివరి నెల దాకా ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. డిసెంబర్ 2026లో మాత్రం రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు సంచారంలో మార్పు వచ...