భారతదేశం, డిసెంబర్ 20 -- మరి కొన్ని రోజుల్లో 2025 పూర్తి కాబోతోంది. 2026 రాబోతుంది. 2026 జనవరిలో అనేక పండుగలు, ఉపవాసాలు, శుభదినాలు ఉన్నాయి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి కూడా జనవరిలోనే వస్తుంది. మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 15న వచ్చింది. అలాగే ప్రధాన గ్రహాల సంచారంలో కూడా మార్పు ఉంది. దీంతో ద్వాదశ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి.

మకర సంక్రాంతిని చాలా రాష్ట్రాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఈసారి మకర సంక్రాంతి జనవరి 15న వచ్చింది. భోగి పండుగ జనవరి 14న వచ్చింది. అలాగే కనుమ పండుగ జనవరి 16న వచ్చింది.

పుష్య అమావాస్య: పుష్య అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి.

వసంత పంచమి: వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధిస్తారు. ఆ రోజు సరస్...