భారతదేశం, డిసెంబర్ 6 -- తొలిసారిగా ప్రవేశపెట్టిన ఫిఫా 'శాంతి పురస్కారం' అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దక్కింది. వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో శుక్రవారం (డిసెంబర్ 5) జరిగిన 2026 ఫిఫా ప్రపంచకప్​ డ్రా కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో ఈ వేడుకలో ట్రంప్‌కు ఈ బహుమతిని అందజేశారు. "ఇది మీ పురస్కారం, ఇది మీ శాంతి పురస్కారం," అని ఇన్‌ఫాంటినో ట్రంప్ చేసిన "శాంతి కోసం అసాధారణ చర్యలను" ప్రశంసించారు.

ఈ కొత్త అవార్డుతో "ప్రజలను ఏకం చేసే", "ప్రపంచ శాంతిని పెంపొందించే" వ్యక్తులను సన్మానిస్తామని ఫిఫా తెలిపింది.

ఈ నేపథ్యంలో ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం దక్కాలని ఇన్‌ఫాంటినో బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఈ అవార్డుకు అమెరికా అధ్యక్షుడు "తప్పకుండా అర్హులు" అని ఆయన అన్నారు.

2026 ఫిఫా వరల్...