భారతదేశం, డిసెంబర్ 30 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ రూ.11,460 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. ప్రధానంగా రోడ్డు మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం మెరుగుదలపై దృష్టి సారించింది. మునుపటి జీహెచ్ఎంసీ కోసం 2025-26 సంవత్సరానికి రూ.11,010 కోట్ల సవరించిన అంచనాలను కూడా కమిటీ ఆమోదించింది.

11,460 కోట్ల రూపాయల బడ్జెట్‌లో ఎక్కువ భాగం రోడ్లు, వంతెనలు, ప్రధాన రహదారులను సరిగా మెయింటేనే చేసే సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం(సీఆర్ఎంపీ), హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌సీఐటీఐ) ప్రాజెక్టులకు కేటాయింపులు ఉన్నాయి.

రెండో అత్యధిక వ్యయం పరిశుభ్రత, రీసైక్లింగ్ కార్యక్రమాలపై ఉంటుంది. వీటిలో చెత్త నుండి ఎనర్జీ ప్రక్రియలు కూడా ఉన్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ. 746 కోట్లు కేటాయించారు. ఇతర...