భారతదేశం, డిసెంబర్ 30 -- కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, అప్పుడే ప్లానింగ్ మొదలుపెట్టడం ఎంతో తెలివైన పని. ముఖ్యంగా ప్రయాణాలను ఇష్టపడే వారికి 2026 క్యాలెండర్ ఒక తీపి కబురు అందిస్తోంది. ఈ ఏడాది పండుగలు, ప్రభుత్వ సెలవులు వారాంతాలకు అటు ఇటుగా రావడంతో, కేవలం ఒకటి రెండు రోజులు సెలవు పెడితే చాలు.. అద్భుతమైన లాంగ్ వీకెండ్స్ మీ సొంతమవుతాయి. మీ ట్రావెల్ ప్లాన్స్ కోసం నెలవారీగా ఉన్న లాంగ్ వీకెండ్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

జనవరి నెలలో పర్యాటక ప్రియులకు రెండు మంచి అవకాశాలు ఉన్నాయి.

జనవరి 1 నుండి 4 వరకు: జనవరి 1 (గురువారం) కొత్త సంవత్సరం. జనవరి 2 (శుక్రవారం) ఒక్క రోజు సెలవు తీసుకోండి. ఇక శని, ఆదివారాలతో కలిపి 4 రోజుల మినీ వెకేషన్ ప్లాన్ చేయవచ్చు.

జనవరి 23 నుండి 26 వరకు: జనవరి 23 (శుక్రవారం) వసంత పంచమి, 26 (సోమవారం) గణతంత్ర దిన...