భారతదేశం, డిసెంబర్ 18 -- మరి కొన్ని రోజుల్లో 2025 పూర్తి కాబోతోంది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ బాగుండాలని, అన్నీ కలిసి రావాలని కోరుకుంటారు. కొత్త సంవత్సరం మీకు అన్నీ కలిసి రావాలని అనుకుంటున్నారా? అన్ని విధాలుగా లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే వీటిని ఫాలో అవ్వండి. కొత్త సంవత్సరం లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, ఆర్థిక సమస్యల నుంచి దూరంగా ఉండడానికి వీటిని పాటించడం మంచిది.

అలాగే ఇలా చేయడం వలన సంతోషం, సంపద కూడా పెరుగుతాయి. మరి 2026 ప్రారంభంలో ఏం చేయాలి? ఎలా కొత్త సంవత్సరాన్ని మొదలు పెడితే ఈ లాభాలను పొందడానికి వీలవుతుందో తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం చూస్తే, ఈ ముఖ్యమైన ఐదు పనులు చేయడం వలన చాలా బాగా కలిసి వస్తుంది. 2026 మొదలు కాక ముందే వీటిని పాటించండి.

గరుడ పురాణం ప్రకారం ఏ ఇంట్లో అయితే మహిళను అగౌరవపరుస్...