భారతదేశం, డిసెంబర్ 30 -- మీ 2026 న్యూ ఇయర్​ వేడుకలను మరింత గొప్పగా మార్చేందుకు సోషల్​ మీడియా దిగ్గజం వాట్సాప్​ రెడీ అయ్యింది. ప్రతి ఏటా న్యూ ఇయర్ రోజునే వాట్సాప్‌లో మెసేజ్‌లు, కాల్స్ రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకునే క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు 2026 స్పెషల్ ఫీచర్లను సంస్థ విడుదల చేసింది. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్'.. 2026కి స్వాగతం పలుకుతూ వాట్సాప్ కొన్ని పరిమిత కాల ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.

ప్రత్యేక స్టిక్కర్ ప్యాక్: '2026' థీమ్‌తో కొత్త స్టిక్కర్లను వాట్సాప్ విడుదల చేసింది. వీటిని వ్యక్తిగత చాట్స్ లేదా గ్రూపుల్లో పంపి కొత్త ఏడాది శుభాకాంక్షలను వినూత్నంగా తెలియజేయవచ్చు.

వీడియో ...