భారతదేశం, ఫిబ్రవరి 24 -- 2026 సంవత్సరంలో మొదటి గ్రహణం మరి కొన్ని రోజుల్లో ఏర్పడనుంది. జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా, చంద్రగ్రహణం కనపడబోతోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, చంద్ర గ్రహణం ఎప్పుడు జరుగుతుంది? ఎంతసేపు భారతదేశంలో కనిపిస్తుంది అనేది. చాలా మందికి ఈ సందేహం వుంది. మరి ఈ ఏడాదిలో ఏర్పడనున్న మొదటి చంద్రగ్రహణం ఇండియాలో ఏ సమయానికి కనపడనుంది? పూర్తి వివరాలను చూసేద్దాం.

భారతదేశంలో చంద్రగ్రహణం కనిపిస్తున్నందున దాని సూతక కాలం కూడా చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణం అశుభం అని చెబుతారు. సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణానికి సంబంధించిన కొంత సమాచారం తెలుసుకుందాం.

2026 సంవత్సరపు మొదటి చంద్రగ్రహణం మార్చి 3న జరుగుతుంది. ఇది మధ్యాహ్నం 3.27 నుండి సాయంత్రం 6.47...