భారతదేశం, జనవరి 7 -- 2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని... ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది.

పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించింది. 14వ ఎస్ఐపీబీ సమావేశంలో మొత్తంగా 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో ఇప్పటి వరకు రూ.8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా, 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాల...