భారతదేశం, ఏప్రిల్ 15 -- హీరో మోటోకార్ప్ బెస్ట్ ఆటోమొబైల్ తయారీదారుగా గుర్తింపు పొందింది. దేశీయ మార్కెట్లో స్ప్లెండర్‌తో సహా వివిధ బైక్‌లు, స్కూటర్‌లను విక్రయిస్తుంది. హీరో ఇప్పుడు 2025 గ్లామర్ మోటార్‌సైకిల్‌ను కొన్ని అప్డే‌ట్స్‌తో విడుదల చేసింది. ధరకు కూడా అందుబాటులోనే ఉంది. ఈ బైక్ ధర, స్పెసిఫికేషన్ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

2025 హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ ధర రూ. 84,698 నుంచి రూ. 90,698 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ ఓబీడీ-2బీ, డిస్క్ బ్రేక్ ఓబీడీ-2బీ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. కొత్త హీరో గ్లామర్ బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, సింగిల్-పీస్ సీట్ ఆప్షన్ ఉన్నాయి. ఇది క్యాండీ బ్లేజింగ్ రెడ్, బ్లాక్ మెటాలిక్ సిల్వర్, టెక్నో బ్లూ మ్యాట్ బ్లాక్ రం...