భారతదేశం, ఏప్రిల్ 13 -- ఈ వారంలో రెండు రోజుల పాటు స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న స్టాక్ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ వెబ్‌సైట్‌లోని స్టాక్ మార్కెట్ హాలిడే లిస్ట్ ప్రకారం, సోమవారం బీఎస్ఈ లేదా ఎన్ఎస్‌ఈలో ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని ప్రతి ఏటా జరుపుకొంటారు. అంబేడ్కర్ జయంతి తర్వాత ఏప్రిల్ 15న మార్కెట్ తిరిగి తెరుచుకోనుంది. దీంతో పాటు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 18 శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది.

కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ 2025 ఏప్రిల్ 14 సోమవారం, ఏప్రిల్ 18, 2025 శుక్రవారం జరగదు. వీటితో పాటు కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు(ఈజీఆర్) కూడా నిలిచిపోనున్నాయి. మరింత సమాచారం కోసం, పెట్టుబడిదారులు బీఎస్ఈ-b...