భారతదేశం, డిసెంబర్ 29 -- 2025లో తిరుమల శ్రీవారి ఆలయం పేరు ఎప్పుడూ జనాల్లో ఉంటూనే ఉంది. కేవలం భక్తితో మాత్రమే కాదు.. అనేక విషయాల గురించి టీటీడీ వార్తల్లో నిలిచింది. 2025 సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ఎక్కువగా వినిపిపించింది. సంస్కరణలు, సంక్షోభాలు, దర్యాప్తులు, రాజకీయ వివాదాలు వరుసగా ఆలయం గురించి ప్రజలు మాట్లాడుకునేలా చేశాయి. పరిపాలన, జవాబుదారీతనం, సంస్థాగత పర్యవేక్షణపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి.

2025 సంవత్సరం విషాదకరంగా ప్రారంభమైంది. జనవరిలో వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 40 మందికిపైగా గాయపడ్డారు. భక్తుల రద్దీ సమయంలో నిర్వహణ లోపాలతో ఇది జరిగిందని విమర్శలు వచ్చాయి.

అంతకుముందు విషయాల గురించి జనాల్లో చర్చలు జరుగుతూ ఉండగానే.. అనేక కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి. పరకామణి నగదు లెక్క...