భారతదేశం, ఆగస్టు 12 -- 2025 యెజ్డీ రోడ్‌స్టర్ భారతదేశంలో విడుదలైంది. దీని ధర రూ .2.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త మోడల్‌కు అనేక అప్డేట్స్, కొత్త కలర్ స్కీమ్‌లను జోడించారు. ఇది మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

రెట్రో స్టైలింగ్‌తో ఆధునిక టచ్‌తో యెజ్డీ రోడ్‌స్టర్ డిజైన్ వచ్చింది. గుండ్రని ఎల్ఈడీ హెడ్‌లైట్, టియర్ డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్, కర్వ్డ్ ఫెండర్లు, పలుచని టెయిల్ ల్యాంప్స్‌ ఇందులో అందించారు. బైక్‌ను మరింత ప్రత్యేకంగా చేయడానికి, ఇంటిగ్రేటెడ్ టెయిల్‌లైట్స్, టర్న్ ఇండికేటర్స్, డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్, హైడ్రోఫార్మింగ్ హ్యాండిల్బార్లు, రిమూవబుల్ పిలియన్ సీట్లు వంటి ఫీచర్లతో కూడిన 6 ఫ్యాక్టరీ కస్టమ్ కిట్ల ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ బైక్ బలమైన స్టీల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. దీనికి ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫో...