భారతదేశం, జనవరి 1 -- 2025 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రికార్డుస్థాయిలో విక్ర‌యించ‌బ‌డ్డాయి. 2024వ సంవ‌త్స‌రంతో పోల్చితే 10 శాతం అధికంగా ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు విక్ర‌యించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

గ‌త ఏడాది 12.15 కోట్ల‌ ల‌డ్డూల‌ను విక్ర‌యించ‌గా ఈ ఏడాది 13.52 కోట్ల ల‌డ్డూల‌ను టీటీడీ భ‌క్తుల‌కు విక్ర‌యించింది. అంటే గ‌త ఏడాదితో పోల్చితే 1.37 కోట్ల ల‌డ్డూల‌ను ఈ ఏడాది అద‌నంగా భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది.

గ‌త ద‌శాబ్ద‌కాలంలో ఎన్న‌డూ లేనివిధంగా 2025 డిసెంబ‌ర్ 27వ తేదిన అత్య‌ధికంగా 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను భ‌క్తులు కొనుగోలు చేశారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక విక్రయం.

టీటీడీ గత సంవత్సరంగా ప్ర‌తిరోజూ 4 ల‌క్ష‌ల వరకూ ల‌డ్డూల‌ను త‌యారు చేస్తోంది. ముఖ్య‌మైన రోజుల్లో 8 ల‌క్ష‌ల ...