భారతదేశం, డిసెంబర్ 26 -- 2025 సంవత్సరం మరోసారి నిరూపించింది. భారతదేశంలో సెలబ్రిటీ సంస్కృతి కేవలం సినిమా తెరలు లేదా క్రికెట్ మైదానాలకు మాత్రమే పరిమితం కాదని చాటింది. ఈ ఏడాది సెలబ్రిటీల కాంట్రవర్సీలు పదే పదే వార్తల్లో నిలిచాయి. ఇందులో దీపికా పదుకొణే 8 గంటల వర్క్ డిమాండ్ నుంచి తాజాగా శివాజీ అసభ్యకర కామెంట్ల వరకూ ఉన్నాయి. మధ్యలో స్మృతి మంధాన పెళ్లి రద్దు సంచలనంగా మారింది.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా నుంచి హీరోయిన్ గా దీపికా పదుకొణేను తప్పించడం వైరల్ గా మారింది. ఆమె 8 గంటల వర్క్ డిమాండ్ ప్రధాన కారణమనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రావాల్సి ఉన్న 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి కూడా దీపికాను తప్పించడం కలకలం రేపింది. దీనిపై కౌంటర్లు, ప్రతి కౌంటర్లు కనిపించాయి.

రణవీర్ అలాహాబాదియా ఒక ఎపి...