భారతదేశం, డిసెంబర్ 31 -- 2025లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అనేక వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. వీటిలో టాప్ 10 లిస్ట్ ఇక్కడుంది. ఇందులో థ్రిల్లర్లూ ఉన్నాయి. ఇంకెందుకు లేటు ఓ లుక్కేయండి మరి.

ఫాల్‌అవుట్ (సీజన్ 2)

డిసెంబర్‌లో భారీగా ప్రీమియర్ అయింది. ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 వెబ్ సిరీస్ గా కొనసాగుతోంది. ఎల్లా పూర్నెల్, వాల్టన్ గొగ్గిన్స్, ఆరోన్ మోటెన్ తదితరులు నటించారు. కొత్త సీజన్ మొజావే వేస్ట్‌ల్యాండ్, న్యూ వెగాస్‌కి వెళుతుంది. లూసీ, ఘోల్ కలిసి హాంక్ మాక్‌లీన్‌ను వెంబడిస్తారు. నామ్ మాక్‌లీన్ వాల్ట్ రహస్యాలను వెలికితీస్తాడు.

రీచర్ (సీజన్ 3)

ఫిబ్రవరిలో ఓటీటీలోకి విడుదలైంది రీచర్ సీజన్ 3. ఇది 'పర్స్యూడర్' నవల ఆధారంగా తెరకెక్కింది. 2025లో అత్యధిక వ్యూస్ రాబట్టిన వెబ్ సిరీస్‌లలో ఇది ఒకటి. అలన్ రిట్చ్‌సన్, మారియా స్...