భారతదేశం, ఆగస్టు 5 -- 2025 ఏడాది టెలివిజన్, ఓటీటీ స్ట్రీమింగ్ కు కలిసొస్తోంది. స్క్విడ్ గేమ్ నెట్ ఫ్లిక్స్ కు తిరిగి వచ్చింది. ల్యాండ్ మ్యాన్ పారామౌంట్+ను పేల్చాడు. ఎన్సీఐఎస్, లవ్ ఐలాండ్ వంటి పాత ఫేవరెట్లు సంప్రదాయ ప్లాట్ ఫామ్ ల్లో వ్యూస్ ను పెంచుకుంటూ పోతున్నాయి. అయినా పెద్ద పెద్ద సినిమాలు, సిరీస్ లు, షోలను దాటి ఓ పిల్లల యానిమేటెడ్ సిరీస్ సత్తా చాటుతోంది. ఈ ఏడాది అత్యధిక మంది వీక్షించిన టీవీ షోగా కొనసాగుతోంది. అదే ఆస్ట్రేలియన్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ 'బ్లూయ్' (Bluey).

ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన టీవీ షోగా ఇప్పటికే 25 బిలియన్ వ్యూస్ సాధించింది బ్లూయ్. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్ ప్రపంచవ్యాప్తంగా షోల వ్యూయర్షిప్ సంఖ్యలు, టీవీ రేటింగ్స్ తో జాబితా చేసింది. 2025 జనవరి నుంచి జూన్ వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రసారమైన, అత్య...