భారతదేశం, జూలై 30 -- జియోహాట్‌స్టార్‌ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్' ఓటీటీలో అదరగొడుతోంది. సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీ క్రిమినల్ జస్టిస్ నుంచి వచ్చిన నాలుగో సీజన్ డిజిటల్ స్ట్రీమింగ్ లో దుమ్మురేపుతోంది. కోర్టు డ్రామా థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఓ నర్సు హత్య కేసులో చిక్కుకున్న రాజ్ నాగ్పాల్ అనే వ్యక్తిని వెటరన్ లాయర్ మాధవ్ మిశ్రా ఎలా రక్షించాడన్నదే కథ. మరోసారి మాధవ్ మిశ్రాగా పంకజ్ త్రిపాఠి అదరగొట్టాడు. ఒర్మాక్స్ మీడియా డేటా ప్రకారం ఈ హిందీ వెబ్ సిరీస్ ను తొలి ఆరు నెలల్లో 27.7 మిలియన్ మంది చూశారు.

ఓ బాబా రాష్ట్రాన్ని శాసించే వ్యక్తిగా ఎలా ఎదిగాడు? సీఎంను కీలుబొమ్మను చేసి ఎలా ఆడించాడు? అతని నిజ స్వరూపం బయటపడిందా? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో వచ్చింది 'ఏక్ బద్నాం ఆశ్రమ్ సీజన్ 3'. ఇందు...