భారతదేశం, జూలై 21 -- సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, రామ్ చరణ్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్ వంటి స్టార్ల సినిమాలు 2025లో థియేటర్లకు వచ్చాయి. కానీ ఇవి ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే అనూహ్యంగా పెద్దగా అంచనాలు లేని ఓ హిందీ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల దుమ్ము దులిపింది. అదే 'ఛావా'. ఇండియాలో 2025లో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఛావా కొనసాగుతోంది.

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఛావా నిలిచింది, వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఈ చిత్రం దాదాపు రెండు నెలల పాటు థియేట్రికల్ రన్ ను కొనసాగించింది. దాని విజయం ఎంత పెద్దదంటే, హిందీ సినిమాను చివరికి తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ప్రేక్షకుల్లో డిమాండ్ ఉండటంతో 24 గంటల రన్నింగ్ షోలు కూడా వేశారు. ఛత్రపతి శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించాడు. ఇందులో రష్...