భారతదేశం, డిసెంబర్ 30 -- భారత ఆటోమొబైల్ రంగం 2025లో ఒక చారిత్రాత్మక మార్పుకు సాక్ష్యంగా నిలిచింది. స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, ప్రయాణికుల వాహనాల విక్రయాల్లో రెండో స్థానానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నాళ్లూ ఆ స్థానంలో పాతుకుపోయిన టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా వంటి సంస్థలను వెనక్కి నెట్టి మహీంద్రా ఈ ఘనత సాధించడం విశేషం. కేవలం ఎస్‌యూవీలపైనే దృష్టి సారించే ఒక స్వదేశీ కంపెనీ.. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లు అమ్మే దిగ్గజాలను అధిగమించడం ఇదే మొదటిసారి.

ప్రభుత్వ వాహన్ పోర్టల్​లోని డిసెంబర్ 25, 2025 నాటి గణాంకాల ప్రకారం..ఎప్పటిలాగే మారుతీ సుజుకీ 17.50 లక్షల యూనిట్ల విక్రయాలతో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. మహీంద్రా ఏకంగా 5.81 లక్షల వాహనాలను రిజిస్టర్ చేసింది. ఇదే సమయంలో టాటా మోటార్స్ 5.52 లక్షల యూనిట్లు, హ్యుందాయ...