Hyderabad, అక్టోబర్ 13 -- కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 11: రిషబ్ శెట్టి నటించిన శాండల్ వుడ్ చిత్రం కాంతార చాప్టర్ 1 రెండో వీకెండ్‌‌లో కూడా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. శనివారం (అక్టోబర్ 11) రూ. 39 కోట్లతో అద్భుతమైన నెట్ కలెక్షన్స్ సాధించింది కాంతార 2 సినిమా.

తొమ్మిదో రోజుతో పోలిస్తే పదో రోజున ఏకంగా 75.28 శాతం పెరిగాయి కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్. అలాగే, 11వ రోజు అయిన ఆదివారం కూడా కలెక్షన్లతో జోరు చూపించింది ఈ కన్నడ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. రెండో ఆదివారం నాడు ఇండియాలో కాంతార చాప్టర్ 1 సినిమాకు రూ. 40 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది.

ఈ 40 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌లో కన్నడ నుంచి రూ. 12.3 కోట్లు, తెలుగు ద్వారా 4.8 కోట్లు, హిందీ బెల్ట్ నుంచి 14.25 కోట్లు, తమిళంలో 5.25 కోట్లు, మలయాళం నుంచి 3...