భారతదేశం, సెప్టెంబర్ 8 -- 2025లో చాలా తమిళ సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చాయి. ఇందులో స్టార్ హీరోల సినిమాలూ ఉన్నాయి. కానీ వీటిల్లో కొన్ని చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కలెక్షన్ల దుమ్ము రేపాయి. అలాంటి టాప్-5 తమిళ అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల లిస్ట్ ఇక్కడుంది. ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో చూసేద్దాం.

ఈ వయసులో తన స్వాగ్ తో, యాక్టింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ తో కేకలు పెట్టిస్తున్నారు తలైవా రజనీకాంత్. కూలీ అంటూ థియేటర్లలో ఆయన చేసిన హంగామా మామూలుగా లేదు. ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ వసూళ్ల జోరు అదిరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.550 కోట్లకు పైగా రాబట్టి సంచలనం నమోదు చేసింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ మూవీ కూలీ. ఈ ఫిల్మ్ మరో మూడు రోజుల్లో ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్ 11 నుంచి...