భారతదేశం, డిసెంబర్ 17 -- 2025 సంవత్సరంలో ఓటీటీలో చాలా వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాయి. వీటిల్లో కొన్ని అదరగొట్టాయి. అలాంటి ఈ ఏడాది విడుదలైన అత్యధిక ఐఎండీబీ రేటింగ్ పొందిన 10 హిందీ వెబ్ సిరీస్ ల లిస్ట్ ఇక్కడుంది. ఓ సారి చూసేయండి. ఈ జాబితాలో ఆర్యన్ ఖాన్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ కూడా ఉంది.

అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ పంచాయత్ ఈ ఐఎండీబీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. పంచాయత్ కొత్త సీజన్ ఈ ఏడాది విడుదలైంది. ఈ సిరీస్ కు ఐఎండీబీ రేటింగ్ 9గా ఉంది. చందన్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా కాంబినేషన్ లో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు వచ్చాయి. ఈ సిరీస్ నాల్గవ సీజన్ ఈ సంవత్సరం విడుదలైంది. ఇదొక పొలిటికల్ డ్రామా, కామెడీ సిరీస్. ఐఎండీబీ ప్రకారం ఈ సిరీస్ కు సుమారు 68 అవార్డులు వచ్చాయి.

జాబితాలో రెండవ స్థానంలో స్పై యాక్షన్ డ్రామా సిరీస్ ది ఫ్యామిలీ మ్య...