Hyderabad, జూన్ 24 -- అమావాస్య గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హిందూ ధర్మంలో అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. 2025లో వచ్చే అమావాస్యలలో ఈ అమావాస్య చాలా స్పెషల్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే జూన్ 26 నుంచి వెంటనే గుప్త నవరాత్రులు మొదలవుతాయి. పైగా అమావాస్యనాడు చంద్రుడు, గురువు సంయోగం చెంది మిధున రాశిలో సంచరిస్తారు. పైగా మృగశిర నక్షత్రం చాలా ప్రత్యేకమైనది.

మృగశిర నక్షత్రం నాడు ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా అది పూర్తవుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి మృగశిర నక్షత్రం చాలా మంచిది. అంతేకాకుండా వెంటనే ఆరుద్ర నక్షత్రం కూడా వస్తుంది. ఇది రాహువు నక్షత్రం. ఏదైనా అనుకున్న వాటిని పూర్తవడానికి ఇది మంచిది. మన కోరికలను త్వరగా నెరవేర్చుకోవడానికి ఈ రోజు చాలా ఉత్తమమైనది.

జ్యేష్ఠ అమావాస్య తిథి - జూన్ 24 సాయంత్రం 7:00 గంటలక...