భారతదేశం, ఏప్రిల్ 29 -- 2024లో భారత్ సైనిక వ్యయం పాకిస్తాన్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువని, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ఆయుధాలపై ప్రపంచ వ్యయం అత్యంత వేగంగా పెరుగుతోందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (Sipri) సోమవారం ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది.

భారత్ సైనిక వ్యయం 2024 లో అంతకుముందు సంవత్సరం కన్నా 1.6 శాతం పెరిగి 86.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనికి భిన్నంగా 2024 లో పాకిస్థాన్ రక్షణ రంగంపై చేసిన వ్యయం 10.2 బిలియన్ డాలర్లు మాత్రమే. 'భారత్ రక్షణ రంగంపై చేసిన వ్యయం 2015తో పోలిస్తే 42 శాతం పెరిగిందని 'ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్ పెండిచర్ 2024' పేరుతో విడుదల చేసిన నివేదికలో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా, సైనిక వ్యయం 2024 లో 2718 బిలియన్ డాలర్లకు చ...