భారతదేశం, నవంబర్ 2 -- హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ తో వివాదంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రియాక్షన్ వైరల్ గా మారింది. ఈ వ్యవహారంలో తన మీద చేసిన ఆరోపణలు అసత్యం, నిరాధారం, ప్రతీకారపూరితమైనవే అని ప్రశాంత్ పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. హనుమాన్ మూవీని ప్రొడ్యూస్ చేసిన ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది.

మీడియాలో వస్తున్న వార్తలపై ప్రశాంత్ వర్మ అసహనం వ్యక్తం చేశాడు. ''కొన్ని మీడియా పోర్టల్స్, సోషల్ మీడియా పేజీలు, న్యూస్ ఛానెల్స్ ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఫిర్యాదు వివరాలను, అలాగే నా సమాధానంలోని కొన్ని భాగాలను మాత్రమే ప్రచురించడం, ప్రసారం చేయడం నా దృష్టికి వచ్చింది. ఈ పక్షపాత, బాధ్యతారహిత, ఏకపక్ష సమాచారం ప్రసారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్న...