భారతదేశం, ఆగస్టు 18 -- బాక్సాఫీస్ దగ్గర వార్ 2 కలెక్షన్లు జోరు అందుకోవడం లేదు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ డెబ్యూలో షాక్ తప్పేలా లేదు. ఈ సినిమా వసూళ్లు సండే కూడా పుంజుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు రూ.200 కోట్లు దాటినా.. సినిమా లాభాల్లోకి రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందు ఆగస్టు 14న వార్ 2 థియేటర్లలో రిలీజైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. వార్ 2 మొదటి మూడు రోజుల్లో భారతదేశంలో రూ.142.60 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మూడు రోజుల్లో గ్రాస్ చూస్తే రూ.170 కోట్లుగా ఉన్నాయి. ఇందులో హిందీ, తెలుగు వెర్షన్లలో శనివారం 42% వసూళ్లు తగ్గాయి. ఆదివారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఆగస్టు 17న ఈ సినిమా రూ.31 క...