భారతదేశం, జనవరి 3 -- 2026 సంవత్సరం స్మార్ట్‌ఫోన్ లవర్స్​కి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు వరుస లాంచ్‌లతో మొబైల్ మార్కెట్ కళకళలాడుతోంది. పలు ప్రధాన కంపెనీలు తమ వినూత్న ఉత్పత్తులను జనవరి నెలలోనే మార్కెట్లోకి తెస్తుండటంతో కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి మరిన్ని ఆప్షన్లు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో లాంచ్​కానున్న స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

రియల్‌మీ ఈ ఏడాదిని జనవరి 6న గ్రాండ్‌గా ప్రారంభించనుంది. ఈ సిరీస్‌లో 'రియల్‌మీ 16 ప్రో', 'రియల్‌మీ 16 ప్రో ప్లస్' అనే రెండు మోడళ్లు రానున్నాయి. ఈ ఫోన్లు ప్రధానంగా కెమెరా పనితీరుపై దృష్టి సారించాయి.

కెమెరా: రెండింటిలోనూ 200ఎంపీ మెయిన్ కెమెరా ఉండగా, ప్రో ప్లస్ మోడల్‌లో 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అదనంగా చేర్చారు.

ప్రాసెసర్: రియల్​మీ 16 ప్ర...