భారతదేశం, ఆగస్టు 22 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్.. చైనాలో కొత్త ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్‌ను విడుదల చేసింది. గురువారం లాంచ్ అయిన ఈ హానర్​ మ్యాజిక్​ వీ ఫ్లిప్​ 2.. శక్తివంతమైన ఫీచర్‌లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ 5,500ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తుంది. ముఖ్యంగా ఇందులో 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

హానర్​ మ్యాజిక్​ వీ ఫ్లిప్​ 2 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజ్‌తో లభిస్తుంది. దీనికి 6.82-ఇంచ్​ ఎల్టీపీఓ ఓఎల్‌ఈడీ ఫోల్డెబుల్ ఇన్నర్ స్క్రీన్, 4-ఇంచ్​ ఓఎల్‌ఈడీ ఎల్టీపీఓ కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ మోడల్ గతంలో వచ్చిన హానర్ మ్యాజిక్ వీ ఫ్లిప్‌కు కొనసాగింపుగా మార్కెట్లోకి వచ్చింది.

చైనాలో ఈ హానర్​ మ్యాజిక్​ వీ ఫ్లిప్​ 2 ధర 5,499 యువాన్​ (సుమా...