భారతదేశం, డిసెంబర్ 19 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో మరో సంచలనానికి సిద్ధమైంది! ఇటీవల విడుదలైన షావోమి 17 సిరీస్‌లోకి 'షావోమి 17 అల్ట్రా' మోడల్‌ను తీసుకొస్తున్నట్టు కంపెనీ ఇటీవలే అధికారికంగా ధృవీకరించింది. వచ్చే వారమే ఈ స్మార్ట్​ఫోన్‌ని చైనా మార్కెట్లో లాంచ్ చేయనున్నారు! ఈ సిరీస్‌లో ఇప్పటికే షావోమి 17, 17 ప్రో, 17 ప్రో మాక్స్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో షావోమీ 17 అల్ట్రాపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

షావోమి సంస్థ తన వీబో అకౌంట్​లో షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. ఈ స్మార్ట్​ఫోన్ వచ్చే వారం చైనాలో విడుదల కానుంది! ఖచ్చితమైన తేదీని వెల్లడించనప్పటికీ, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 22 నుంచి 27 మధ్య ఈ లాంచ్​ ఈవెంట్ ఉండొచ్చు. ముఖ్యంగా డిసెంబర్ 26న లాంచ్ అయ్యే అవకాశం ఎక్క...