భారతదేశం, జనవరి 30 -- అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, సింగర్, సంగీత దర్శకుడు రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ దేవగుడి. ఈ సినిమాకు బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంతోపాటు స్వీయ నిర్మాతగా వ్యవహరించారు. ఇవాళ (జనవరి 30) దేవగుడి సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఇటీవల దేవగుడి దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డితోపాటు సింగర్ రఘు కుంచె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను సింగర్ రఘు కుంచె పంచుకున్నారు.

-నేను దేవగుడి సినిమాలో వీరారెడ్డి అనే పాత్రలో నటించాను. ఆయన ఆ చుట్టు పక్కల ఏరియాలో పవర్ ఫుల్ వ్యక్తి. నాకు పలాస సినిమా తర్వాత అలాంటి రోల్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో వీరారెడ్డి పాత్ర కోసం దర్శకుడు రామకృష్ణా రెడ్డి గారు ఎలా చెబితే అలా పర్ ఫార్మ్ చేశాను. రాయలసీమ యాసలో డైల...