Hyderabad, జూలై 28 -- నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ చైనా పీస్. ఈ సినిమాకు అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పై కామెడీ డ్రామాగా తెరకెక్కిన 'చైనా పీస్' మూవీలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఇటీవల చైనా పీస్ టీజర్‌ను హీరో సందీప్ కిషన్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా చైనా పీస్ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో యంగ్ హీరో నిహాల్ కోధాటి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.

హీరో నిహాల్ మాట్లాడుతూ.. "మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నేను నటించినా ఒక సినిమా చూసి సందీప్ కిషన్ గారు నా భుజాన చేయి వేసి చాలా చక్కగా చేశావని మెచ్చుకున్నారు. ఆ క్షణం నేను మర్చిపోలేను" అని అన్నాడు.

"కష్టపడి సినిమ...