Hyderabad, మే 23 -- ప్రారంభించిన రోజునుంచీ ప్రతిభావంతులైన కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు, చిత్రబృందం అచంచలమైన అంకితభావంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ తిరుగులేని ఛానల్‌​గా ఎదిగింది జీ తెలుగు.

మే 18, 2025 నాటికి విజయవంతంగా ఇరవై సంవత్సరాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలకు ప్రతిష్ఠాత్మక జీ తెలుగు అప్సర అవార్డులను ప్రదానం చేసింది. వెండితెర, బుల్లితెర తారల సందడితో వైభవంగా జరిగిన జీ తెలుగు అప్సర అవార్డ్స్​ ఈ శనివారం (మే 24) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్​ యాంకర్స్​ సుధీర్​, రవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో డ్రామా జూనియర్స్ పిల్లలు చిరంజీవి, బాలకృష్ణ గెటప్‌లో వేదికపైకి వచ్చి ప్రముఖ నటి రోజాకు అ...