భారతదేశం, డిసెంబర్ 26 -- ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల లీడ్ రోల్లో నటించిన సినిమా మోగ్లీ. ఈ సినిమా డిసెంబర్ 13న థియేటర్లలో రిలీజైంది. అఖండ 2 కారణంగా ఒక రోజు ఆలస్యంగా వచ్చినా బాక్సాఫీస్ దగ్గర నిరాశ తప్పలేదు. అయితే ఇప్పుడీ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న డిజిటల్ ప్రీమియర్ కానుంది.

సందీప్ రాజ్ డైరెక్షన్ లో వచ్చిన మోగ్లీ మూవీ జనవరి 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (డిసెంబర్ 26) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ప్రతి హీరో సిటీలోనే పుట్టడు.. కొందరు అడవి నుంచీ వస్తారు. మోగ్లీ 2025 జనవరి 1 నుంచి కేవలం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది సందీప్ రాజ్ సినిమా. కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్" అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.

దీంతోపాటు ఈటీవీ విన్ సబ్‌స్క్రిప్షన్ పై డిస్కౌంట్ ఆఫర్లు...